ప్రజావాణి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి..
జుక్కల్, ఆంధ్రప్రభ : మండలస్థాయి ప్రజావాణి ద్వారా ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలని జుక్కల్ ఎంపీడీవో బి. శ్రీనివాస్ సూచించారు. మండలస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సోమవారం జుక్కల్ ఎంపీడీవో సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలిరోజు నిర్వహించిన ప్రజావాణికి రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో బి. శ్రీనివాస్ తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పి. మారుతి, ఎంపీవో రాము, విద్యాశాఖ అధికారి తిరుపతయ్య, పంచాయతీరాజ్ ఏఈ శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
