నాగుల పంచమి సందర్భంగా సర్పంచ్ ప్రత్యేక పూజలు

నార్సింగి, ఆంధ్రప్రభ: నాగుల పంచమి సందర్భంగా నార్సింగి మండల కేంద్రంలోని గరికపొట్టి మైసమ్మ నాగుల పుట్ట వద్ద సర్పంచ్ ఆకుల సుజాత మల్లేశం గౌడ్ సోమవారం పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాగదేవతకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా నాగుల పంచమి ప్రాధాన్యాన్ని పురస్కరించుకుని భక్తులు పుట్ట వద్ద పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో స్థానికులు, భక్తులు పాల్గొన్నారు.