Ap-Ports-Privatisation : పోర్టుల ప్రైవేటీక‌ర‌ణ లేదు Andhra Prabha Top News

Ap-Ports-Privatisation : పోర్టుల ప్రైవేటీక‌ర‌ణ లేదు Andhra Prabha Top News

  • ఆ ఊజు లేదు.. ప్ర‌తినాద‌న లేదు
  • శాస‌న‌మండ‌లిలో మంత్రి జ‌నార్థ‌న రెడ్డి స్ప‌ష్టం

(ఆంధ్ర‌ప్ర‌భ‌, అమ‌రావ‌తి )

Ap-Ports-Privatisation : ఏపీలోని పోర్టుల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఎలాంటి ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు. పోర్టుల ప్రవేటీకరణ అనే ప్రశ్న ఉత్పన్నం కాదు, అని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి శౄన‌ప మండ‌లిలో వెల్ల‌డించారు.. పోర్టుల సమాచారం, ప్రవేటీకరణపై ఎమ్మెల్సీలు తుమాటి మాధవరావు, మెరిగ మురళీధర్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు, ఈ సంద‌ర్భంగా మంత్రి జ‌నార్థ‌న ర‌డెడి శాస‌న‌మండిల‌లొ మంట్లాడుతూ,
రాష్ట్రంలో 6 ఆఫరేషనల్ పోర్టులు (విశాఖ గంగవరం, కాకినాడ యాంకరేజ్, కాకినాడ డీప్ వాటర్, రవ్వా, కృష్ణపట్నం) ప్రస్తుతం ఉన్నాయినిర్మాణ దశలో 5 పోర్టులు (మూలాపేట, AMNS (ఆర్సెల్లార్ మిట్టల్ – నిప్పన్ స్టీల్), కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం) ఉన్నాయి ఇతర నోటిఫైడ్ పోర్టులు 6 (కళింగపట్నం, భీమునిపట్నం, నరసాపురం, ఓడరేవు, నిజాంపట్నం, నక్కపల్లి) ఉన్నాయి.. రాంబిల్లిలో నావల్ ప్రత్యామ్నాయ ఆపరేటింగ్ బేస్ ఉన్నాయ‌ని, ఏ పోన్టునూ ప్ర‌వైటిక‌రించాల‌నే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ప్ర‌తీ ఫ్యామిలీకి పీఎన్ జీ క‌నెక్ష‌న్ ఇప్తాం

ఏపీలోని ప్రతి కుటుంబానికి పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు అందించేందుకు ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలున్నాయి, అని మంత్రి .నార్థ‌రన రెడ్డి అన్నారు. పీఎన్ జీ కనెక్షన్లపై ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, పి. రాజశేఖరం ప్రశ్నలకు శాస‌న మండ‌లిలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సమర్పించిన నివేదికల ప్రకారం 13.08.26 నాటికి ఏపీలో 90,013 గృహా వినియోగ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు అందించాం..మిగిలిన కనెక్షన్లు వినియోగదారులకు అందించే ప్రక్రియ కొనసాగుతుంది.