కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాం
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తాం
- టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ రాజకీయ సమీకరణలు రోజురోజుకు మారుతున్నాయి. ఒకటో వార్డులో పోటీ లేకుండానే ప్రచారం కొనసాగుతుందని చెప్పవచ్చు. స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థి కిన్నెర వెన్నెల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు నేతృత్వంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంది. ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు రంగంలోకి దిగడంతో వారు వన్ సైడ్ ల మారుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుర్ర లింగయ్య గెలుపు దాదాపు ఖాయమైందని పలువురు భావిస్తున్నారు. టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ప్రచారంలో అడుగడుగున ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని ఆయన పేర్కొన్నారు.
కుర్ర లింగయ్య మాట్లాడుతూ.. ఒకటో వార్డు ప్రజలందరికీ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని, ఆశీర్వదించాలని ఆయన తెలిపారు. హస్తం గుర్తుకు ఓటెయ్యండి, బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తానని ఆయన తెలిపారు. 6 గ్యారంటీల అమలతో పాటు ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రత్యేక కార్యచరణ చేపడతానని ఆయన పేర్కొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఆయన తరుపున ప్రచారం చేయడం విశేషం. మరోసారి కుర్ర లింగయ్య కౌన్సిలర్ గా గెలవడం ఖాయమని ఇప్పటికే జోరుగా చర్చ సాగుతుంది. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే కష్టం రాకుండా చూసుకుంటానని ఆయన తెలిపారు. వార్డు సందర్శన కార్యక్రమం నిరంతరం చేపట్టి వార్డులను ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు
