TPCC Chief | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ గౌడ్ ఫైర్
TPCC Chief | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై మహేష్ గౌడ్ ఫైర్
TPCC Chief | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్య అని ఆయన ఆరోపించారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నోటీసు జారీ అయ్యిందని, దానిని నామినేషన్ తిరస్కరణకు కారణంగా చూపడం సరైంది కాదన్నారు.
అసలు కోర్టు నోటీసులకు సంబంధించిన వివరాలను నామినేషన్ పత్రాల్లో తప్పనిసరిగా పేర్కొనాలనే నిబంధన ఎక్కడా లేదని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి చర్యలు చేపడుతున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారని ఆయన ఆరోపించారు.
