Disappear|ఇంటర్ విద్యార్థి అదృశ్యం

Disappear| గోరంట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని మందపల్లి పంచాయతీ కరావులపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పవన్ కుమార్ రెడ్డి(17) అదృశ్యమైనట్లూ ఇన్స్ పెక్టర్ బోయ శేఖర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కరావులపల్లి గ్రామానికి చెందిన ఉమామహేశ్వర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డి అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు తెలిపారు. అయితే ఆధార్ అప్డేట్ కోసం ఇంటికి వచ్చి ఆధార్ అప్డేట్ చేసుకున్నాడు. అనంతరం ఈనెల 24న కళాశాలకు వెళ్తానని ఇంటి నుండి వెళ్ళాడు. అయితే పవన్ కుమార్ రెడ్డి కళాశాలకు రాలేదంటూ కళాశాల సిబ్బంది ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లి సుభాషిణి గోరంట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply