Tirupati | రాజ్ పార్క్ హోటల్‌లో ముమ్మర తనిఖీలు

Tirupati | రాజ్ పార్క్ హోటల్‌లో ముమ్మర తనిఖీలు

Tirupati |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : తిరుపతి నగరంలోని రాజ్ పార్క్ హోటల్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఓ అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ కాల్ ద్వారా హోటల్‌లో బాంబు పెట్టినట్లు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు హోటల్‌కు చేరుకుని విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. అలిపిరి ఇన్‌చార్జ్ సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో హోటల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

గంటల పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం హోటల్‌లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు నిర్ధారించారు. దీంతో హోటల్ యాజమాన్యం, అతిథులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply