పిడుగుల వానలు… తస్మాత్ జాగ్రత్త
ఏపీ వాతావరణశాఖ హెచ్చిరక
( ఆంధ్రప్రభ, అమరావతి) ; వాయువ్య బంగాళాఖాతంలోని అల్పపీడనం పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా జార్ఖండ్ వైపు కదులుతూ సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది.దీని ప్రభావంతో ఈరోజు మేఘావృతమైన వాతావరణంతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది
