యువ సమ్మేళనంలో ప్రదీప్‌కు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన హిందూ యువ సమ్మేళనంలో ఎన్నారై ప్రదీప్ బిరుకూరిని సన్మానించారు. సామాజిక సేవా కార్యక్రమాల వైపు యువతను ప్రోత్సహిస్తున్నందుకు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ ప్రదీప్‌ను సత్కరించి అభినందించారు.

పలువురు ప్రముఖులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, యువకులు పాల్గొని ప్రదీప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.