గోదావరి నదిలో మృతదేహం లభ్యం…
బాసర, ఆగస్టు 13 (ఆంధ్రప్రభ ) : బాసర గోదావరి నదిలో గురువారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు బాసర సీఐ దీపక్ తెలిపారు. సీఐ దీపక్ తెలిపిన వివరాల మేరకు ఉదయం గోదావరి నదిలో త్రిబుల్ ఐటీ వాటర్ పంప్ దగ్గర ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం ఉందన్న సమాచారం మేరకు వయసు గజ ఈతగాళ్ళ సహాయంతో వ్యక్తి మృతదేహన్ని వెలికితీయగా ఎటువంటి ఆధారాలు లభించలేదని, మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని, మృతుడు తెల్లని టీ షర్టు, బ్లాక్ కలర్ ప్యాంట్ ధరించి వున్నాడని పేర్కొన్నారు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతున్ని ఎవరైనా గుర్తించినట్లయితే ఈ ఫోన్ నెంబర్ 8712659540 కు లేదా బాసర పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇవ్వాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ దీపక్ అన్నారు.
