చిట్ ఫండ్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ కృష్ణారావు
పల్నాడు( ఆంధ్రప్రభ) : అధిక లాభాలు, తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు వంటి తప్పుడు హామీలతో చిట్ ఫండ్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా SP కృష్ణారావు సూచించారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థ రిజిస్ట్రేషన్, అనుమతులు తప్పనిసరిగా పరిశీలించాలని, నగదు కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారానే చెల్లింపులు చేయాలని తెలిపారు. మోసంపై అనుమానం వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, 112 సమాచారం ఇవ్వాలని సూచించారు.
