Bull Rescue | 40 అడుగుల బావిలో ఘోరం
Bull Rescue | 40 అడుగుల బావిలో ఘోరం
Bull Rescue | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. 40 అడుగుల లోతైన బావిలో పడిన ఎద్దును రక్షించేందుకు ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగగా, అక్కడ ఆక్సిజన్ లేకపోవడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందింది.
స్థానికుల వివరాల ప్రకారం.. బావిలో పడిన ఎద్దును బయటకు తీసేందుకు మొదట ప్రయత్నాలు ప్రారంభించగా, ఆ తర్వాత ముగ్గురు వ్యక్తులు బావిలోకి దిగారు. అయితే కొద్దిసేపటికే వారు అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను బావి నుంచి వెలికితీశారు. బావిలో విష వాయువులు లేదా ఆక్సిజన్ లేమి కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
