GOA BOAT TRAGEDY | 23 మంది మృతి, 64 మంది గల్లంతు

GOA BOAT TRAGEDY | 23 మంది మృతి, 64 మంది గల్లంతు

GOA BOAT TRAGEDY | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో ప్రయాణిస్తున్న ఓ లాంచీ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపుతప్పి నీటిలో మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 23మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మరో 64 మంది గల్లంతైనట్లు సమాచారం.

ప్రాథమిక సమాచారం ప్రకారం లాంచీలో అనుమతించిన సంఖ్య కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. నీటిలో మునిగిపోయిన పడవలో ఉన్న పలువురు బయటపడలేకపోయారు.

సమాచారం అందుకున్న కోస్ట్‌గార్డ్‌, నౌకాదళం, విపత్తు నిర్వహణ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

ఈ ఘటనతో గోవా తీర ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ ప్రారంభించారు.

Leave a Reply