Bhupalpally | ఏసీబీ ఎఫెక్ట్

Bhupalpally | ఏసీబీ ఎఫెక్ట్

బోసిపోయిన సబ్ – రిజిస్ట్రార్‌ కార్యాలయం


Bhupalpally | భూపాల‌ప‌ల్లి జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : జ‌యశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally district) జిల్లాలో ఏసీబీ దాడులతో స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యం బోసిపోయింది. గత శుక్రవారం ఏసీబీ అధికారుల సోదాల అనంతరం నుండి డాక్యుమెంట్ రైటర్ లు షాపులు తెర‌వ‌డం లేదు.

ఈ రోజు కనీసం ఒక్క షాపు కూడా ఓపెన్ చేయలేదు. దీనితో డాక్యుమెంట్ రైటర్ల (Document writers) పై ఆధారపడి ఉన్న భూ క్రయ విక్రయ దారులు స్లాట్ బుక్ చేసుకోవడం రాకపోవడంతో కార్యాలయానికి రాకపోవడంతో సంద‌ర్శ‌కులు కనిపించలేదు. అత్యంత రద్దీగా ఉండే సోమవారం కేవలం రెండు స్లాట్లే బుక్ అయినట్లు ఇంచార్జ్ సబ్ రిజిస్ట్రార్‌ బి.రాజేష్ తెలిపారు. మ్యారేజీ రిజిస్ట్రేషన్ లు చేసుకునే వారే కార్యాలయంలో కనిపిస్తున్నారు.

Leave a Reply