JHANSI| గొప్ప వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి..
- ఏబీవీపీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మన్నూరు మల్లికార్జున
JHANSI| గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు రెండో పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతి జూనియర్ కళాశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీబాయి చిత్రపటానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏబీవీపీ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మన్నూరు మల్లికార్జున మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ స్వాతంత్ర సమరయోధురాలు మహిళ అనుకుంటే ఏదైనా సాధించగలరు నిరూపించిన గొప్ప వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి అన్నారు.
పాశ్చాత సంస్కృతి వైపు వెళ్లకుండా నేటితరం యువత, మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని అన్నారు. చిన్న వయసు నుంచే దేశభక్తి అలవర్చుకొని చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశం కోసం పనిచేసిన ఝాన్సీ లక్ష్మీబాయి నేటి తరానికే కాదు రాబోవు తరాలకు కూడా ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, ఏబీవీపీ నగర కార్యదర్శి శివ చరణ్ మహిళా కన్వీనర్లు కీర్తన, మేఘనా సింధు సామంత్ హాసిని తదితరులు పాల్గొన్నారు.
