ఆలయంలో అన్న ప్రసాదం..
ఆలయంలో అన్న ప్రసాదం..
అన్న ప్రసాదం కొరకు
వంట సామాగ్రి వితరణ
బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీలో గల శ్రీ పెద్ద బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయం లో అన్న ప్రసాదం కొరకు వంట పాత్ర లను కొలిపాక రాజేందర్, కొలిపాక అరవింద్ లు వితరణగా ఇచ్చారు. ఆలయ కమిటీ చైర్మన్ దూడం మహేష్ సమక్షంలో వాటిని శనివారం ఆలయానికి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ దూలం ఐస్ మాట్లాడుతూ కొలిపాక రాజేందర్, కొలిపాక అరవింద్ లు దాదాపు 18 వేల రూపాయల విలువగల వంట పాత్రలను అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ డైరెక్టర్లు పెద్ది రాజేందర్, రమేష్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
