నిందితుడికి కేంద్రమంత్రి, సీఎం సపోర్ట్ : కేటీఆర్
నిందితుడికి కేంద్రమంత్రి, సీఎం సపోర్ట్ : కేటీఆర్
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసును “నీరుగార్చే ప్రయత్నం” చేశారని ఆయన ఆరోపించారు. నిందితుడిని కొంతకాలం దాచిపెట్టారని, చర్యలు ఆలస్యమయ్యాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బాధిత బాలికకు న్యాయం కోసం పోరాడిందని చెప్పారు. కేంద్రమంత్రిని పదవి నుంచి తొలగించాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. తప్పు చేసిన వ్యక్తిని 9 రోజుల పాటు దాచిపెట్టింది కేంద్రమంత్రి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి కలిసి పోక్సో కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. నిందితుడిని దాచిపెట్టిన కేంద్రమంత్రిని ప్రధాని మోదీ వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
