TG Police Jobs | పోలీసుల అడ్డగింతతో ఉద్రిక్తత

TG Police Jobs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కేవలం 5 వేల పోస్టుల ప్రకటన వెలువడడంపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు 19 వేల పోలీస్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో నిరసన చేపట్టారు.

ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన నిరుద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల అడ్డగింతను నిరసిస్తూ నిరుద్యోగులు నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోలీస్ ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసి యువతకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.