health Iకేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు

health I కేంద్ర మంత్రి బండి సంజయ్ తల్లి శకుంతలకు గుండెపోటు
health I ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తల్లి శకుంతల గుండెపోటుకు గురయ్యారు. కరీంనగర్ లోని తమ నివాసంలో ఉన్న ఆవిడకు గుండెనొప్పి రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ కు తరలించగా గచ్చిబౌలిలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శకుంతలకు గుండెకు స్టంట్ వేసిన వైద్యులు అత్యవసర చికిత్స సేవలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మెడికవర్ ఆసుపత్రికి చేరుకొని అమ్మ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శకుంతలకు నలుగురు సంతానం కాగా ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు. అందులో బండి సంజయ్ అందరికంటే చిన్నవాడు.
