ధాన్యం కొనుగోలు లో ఆలస్యం పై ఆగ్రహం..

ధాన్యం కొనుగోలు లో ఆలస్యం పై ఆగ్రహం..

దమ్మపేట, ఆంధ్రప్రభ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో రైతులు కష్ట పడి పండించి వరి కోతలు పూర్తి అయి ,నెల రోజులుగా కాంటాలు మొదలు పెట్టకుండా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు యార్డులలో మగ్గుతూ ఉండటం ,ప్రభుత్వం, సంబధిత అధికారులు నుంచి కనీస స్పందన , స్పష్టమైన ప్రకటన లేకపోవటం పై మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, దమ్మపేట సొసైటీ మాజీ చైర్మన్ , బిఆరెస్ జిల్లా నాయకులు రావు జోగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.దమ్మపేటలో శనివారం రావు జోగేశ్వరరావు ఒక ప్రకటనలో విలేకర్లకు తెలిపారు .గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బిఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరోనా కష్ట కాలంలో కూడా ధాన్యం కొనుగోళ్లు ఆపలేదు అని, ప్రజా ప్రతినిధుల జీతాలను ఆపి రైతులకు చెల్లించిన ఘనత ఆనాడు ప్రభుత్వానికి ఉంటే నేడు రైతులను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు అని , రుణ మాఫీ పూర్తి చేయకుండా , యూరియా కోసం ముప్పు తిప్పలు పెట్టి, కరెంట్ కోతలు విధిస్తూ తీరా అన్నింటిని తట్టుకొని పంటలు పండించిన కొనే దిక్కు లేదన్నారు.

కొనుగోళ్లు కేంద్రాలను అట్టహాసంగా ప్రారంభించిన ప్రభుత్వం ధాన్యాన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి యార్డులకు తరలిస్తే నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు అని ,అకాల వర్షాలకు భయపడి రైతు ప్రతి రోజూ ఆకాశం వైపు చూసే పరిస్థితి నెలకొని ఉందన్నారు . కూల్చటాలు, కాంట్రాక్టుల పైన ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలులో లేదు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాలు మొదలు పెట్టకపోతే రైతులతో కలసి భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం అని , రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి వారికి బోనస్ కూడా చెల్లించే వరకు వారికి బిఆరెస్ పార్టీ తరుపున అండగా నిలబడతాం అని తెలియజేశారు .ఈ ప్రభుత్వం పై రైతులకు నమ్మకం పోయింది అని త్వరలోనే గద్దె దించి రైతు ప్రభుత్వం బిఆరెస్ పార్టీని తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అన్నారు .

Leave a Reply