ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని ప్రసాదించాలి

ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని ప్రసాదించాలి
-టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ: సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా స్ఫూర్తిని కొనసాగించాలని తొర్రూరు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. 10వ వార్డు కౌన్సిలర్ ముద్దసాని సురేష్ జన్మదినం సందర్భంగా శుక్రవారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఝాన్సీ రెడ్డి కేక్ కట్ చేసి శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని వాటర్ ట్యాంక్ వద్ద మున్సిపాలిటీ కార్మికుల సమక్షంలో కేక్ కట్ చేసి కార్మికులకు చికెన్ తో కూడిన భోజనాన్ని ఏర్పాటు చేశారు.
ఈ అన్నదానాన్ని తొర్రూరు చైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పుట్టినరోజు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమని, సేవా కార్యక్రమాలు నిర్వహించి పుట్టినరోజు ప్రత్యేకతను చాటుకోవాలన్నారు. చికెన్ తో కూడిన భోజనాన్ని అందించడం మానవత్వం, దైవత్వమని అన్నారు. అన్నదానం సాటి మనిషి కడుపు నింపుతుందని, మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన కౌన్సిలర్ ముద్ధసాని సురేష్ ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తూర్పాటి రవి, పేర్ల జంపన్న, మాడుగుల భవానీలత, కర్నే నాగరాజు, మణిరాజ్, కాంగ్రెస్ పార్టీ యూత్ పట్టణ అధ్యక్షుడు బి.మహేష్ యాదవ్,10 వార్డు యూత్ నాయకులు అల్లం జంప, ముద్దసాని క్రాంతి, గుండాల ప్రణీత్,తోట శ్రీకాంత్, మలిశెట్టి సాయి, రావుల మహేష్, మనోజ్, రావుల రవి, తల్లారి ప్రవీణ్, గణేష్,మున్సిపాలిటీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
