ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి

  • సర్పంచ్‌ పాలకూరి రమాదేవి

మునుగోడు, ఆంధ్రప్రభ: మునుగోడు మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం స్థానిక సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు.

కొనుగోళ్ల జాప్యంపై అసంతృప్తి…
ధాన్యం కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతుండటంపై సర్పంచ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు మార్కెట్లలో పడిగాపులు కాయకుండా చూడాలని, తక్షణమే కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.

కలెక్టర్‌కు విన్నపం.. అధికారులకు ఆదేశం
అనంతరం మునుగోడు పర్యటనకు వచ్చిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్‌ను సర్పంచ్ కలిసి, కొనుగోలు కేంద్రంలో నెలకొన్న సమస్యలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply