56 trains | ప్రయాణికులకు ఊరట…

56 trains | ప్రయాణికులకు ఊరట…
56 trains | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైళ్ల ఫ్రీక్వెన్సీని గరిష్ఠ స్థాయికి పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు.
సమ్మె కాలంలో రోజంతా 56 రైళ్లను నడపనున్నట్లు మెట్రో సంస్థ వెల్లడించింది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మియాపూర్-ఎల్బీ నగర్ కారిడార్‌లో ప్రతి 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు నడపనుండగా, నాగోల్-రాయదుర్గ్ కారిడార్‌లో ప్రతి 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. దీంతో ఆర్టీసీ సమ్మె ప్రభావాన్ని తగ్గిస్తూ ప్రయాణికులకు కొంత మేర ఊరట లభించనుంది.
