లయన్ ఇమాం బాష సేవలు ఎనలేనివి…

లయన్ ఇమాం బాష సేవలు ఎనలేనివి…
పాయకాపురం, ఆంధ్రప్రభ : విద్యార్థుల సంక్షేమానికి,పాఠశాలల పురోభివృద్హీకి ఎమ్. కె బేగ్ ఎలిమెంటరీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లయన్ ఇమామ్ బాషా చేసిన సేవలు ఎనలేనివని పలువురు వక్తలు ఉద్గాటించారు. సింగ్ నగర్ స్కూల్ ఆవరణలో ఇమామ్ బాషా పదవి విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది ఇమామ్ బాషా దంపతులను ఘనంగా సన్మానించారు.
33 సంవత్సరాల ఉద్యోగ సర్వీసు లో లయన్ ఎమ్. ఎస్. ఇమాం బాష విద్యార్థుల సంక్షేమానికి అవిరళ క్రుసి చేశారని నార్తు మండల విద్యాధికారి1 కె.శ్యాంప్రసాద్ అన్నారు.జిల్లా ఉర్దు రేంజ్ విద్యాధికారి సకీలా ఇమాం బాష ఉర్దు పాఠశాలల్లో ఎక్కువ కాలం పనిచేసి వాటి అభివృద్హి కి ఎనలేని క్రుసి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు పొందారని చెప్పారు. మండల విద్యాధికారి 2 బి. వెంకటేశ్వర రావు బాష ప్రభుత్వ పధకాలను విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు, సమాజానికి చేర వేశారని అభినందించారు.హ్యస్కూల్ హెచ్. ఎమ్. ఎమ్. హుసెన్ ఇమాం బాష లయన్స్ క్లబ్ ద్వారా స్కూల్స్ లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి, సమాజ సేవలో అంకితం అయ్యరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
