Suspension | కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ

Suspension | కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీఓగా జి.సునీత (G. Sunitha as MPDO) పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కడెం ఎంపీడీఓగా కొనసాగిన బి.అరుణ సస్పెన్షన్‌కు గురి కావడంతో ఆమె స్థానంలో దస్తురాబాద్ ఎంపీడీఓగా ఉన్న రమేష్ రెడ్డికి కడెం ఇన్‌చార్జి ఎంపీడీఓగా నియమించారు. కాగా, బుధవారం దస్తురాబాద్ ఎంపీడీఓగా కొనసాగుతున్న జె.సునీతకు డిప్యూటేషన్‌పై కడెం ఎంపీడీఓగా నియమితులయ్యారు. దీంతో కడెం ఎంపీడీఓగా సునీత పదవి బాధ్యతలు స్వీకరించారు. కడెం, దస్తురాబాద్ ఎంపీడీఓలు రమేష్ రెడ్డి, టి శ్రీనివాస్ కడెం మండల పరిషత్ కార్యాలయం సూపరింటెండెంట్ పోశెట్టి కార్యాలయం ఉద్యోగులు సిబ్బంది మండలంలోని పంచాయతీ కార్యదర్శులు కడెం నూతన ఎంపీడీఓ సునీతకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
