దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పారు. హోలీ పండుగకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.
చర్లపల్లి రైల్వేస్టేషన్ నుంచి కాజీపేట మీదుగా ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ వరకు ఈ నెల 6 నుంచి 18వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
07707 రైలు ఈ నెల 6, 12, 16 తేదీల్లో చర్లపల్లిలో రాత్రి 8.45 గంటలకు బయలుదేరి 8, 14, 18 తేదీల్లో తెల్లవారుజామున 1.30 గంటలకు నిజాముద్దీన్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో 07708 రైలు ఈ నెల 8, 14, 18 తేదీల్లో తెల్లవారుజామున 3.15 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
కాజీపేట టూ బల్హర్ష రైలు పున:ప్రారంభం
కరోనా సమయంలో నిలిచిపోయిన కాజీపేట టూ బల్హర్ష రైలు సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ రైలు సేవలు నిలిపివేయడం వల్ల ప్రయాణికులు, పలు వ్యాపార సంస్థలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేంద్ర రైల్వే మంత్రి, దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
పలుమార్లు చేసిన విజ్ఞప్తి మేరకు రైలు సేవలను పున: ప్రారంభించాలని, వెంటనే స్పందించిన రైల్వే శాఖ కాజీపేట టూ బల్హర్ష రైలు పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు. రైలు పున: ప్రారంభం పట్ల తెలంగాణ ప్రజానికం హర్షం వ్యక్తం చేశారు.