ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
చిట్యాల, ఆంధ్రప్రభ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి మాట్లాడుతూ.. ఈ దేశానికి టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని పరిచయం చేసి, ఆధునిక భారత్కు పునాది వేసిన దార్శనికుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన ఎంతో కృషి చేశారన్నారు. అలాగే ఓటు హక్కు వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా దేశంలో యువశక్తికి రాజకీయ ప్రాధాన్యతను పెంచిన మహానేత అని గుర్తుచేశారు. దేశ ప్రధానిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను పథకాలను అమలు పరిచిన ఘనత ఆయనకే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి – సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, మాజీ ఎంపీటీసీ కట్కూరి పద్మ – నరేందర్, సీనియర్ నాయకులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు నాగరాజు, కంచర్ల కిష్టయ్య, బుర్ర శ్రీనివాస్, చిలుముల రాజమౌళి, గుర్రపు నర్సయ్య, ఆకుల ఆదిరెడ్డి, యూత్ నాయకులు ముష్కే నాగరాజు, తుమ్మ రమేష్, గంపల మధుకర్, శంకరయ్య కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
