ఎమ్మెల్యేకు ఏపీడబ్ల్యూజేఎఫ్ నూతన కార్యవర్గ సత్కారం

హెల్త్ కార్డులకు సహకారం పట్ల కృతజ్ఞతలు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) అవనిగడ్డ నియోజకవర్గ నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నియోజకవర్గ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా ఎమ్మెల్యేను కలిసి సత్కరించారు.

ఫెడరేషన్ నియోజకవర్గ నూతన గౌరవ అధ్యక్షుడు గొరుముచ్చు సూర్యనారాయణ, అధ్యక్షుడు అల్లపర్తి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి లంకె శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జొన్నా రవిశంకర్ తదితరులు ఎమ్మెల్యేను కలిసి శాలువాతో సత్కరించారు.

ఇటీవల జరిగిన నూతన కార్యవర్గ ఎన్నిక సభలో నియోజకవర్గ యువ నాయకుడు మండలి వెంకట్రామ్.. నియోజకవర్గంలోని విలేకరులకు హెల్త్ కార్డులు అందించేందుకు ఆర్థిక సహకారం అందిస్తానని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన ఎమ్మెల్యేకు, మండలి వెంకట్రామ్‌కు ఫెడరేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కోట యూరి గగరిన్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఇమ్మిడిశెట్టి రామారావు, ట్రెజరర్ మోపిదేవి అమ్మయ్య, కార్యవర్గ సభ్యులు ఉదయగిరి ప్రశాంత్, అద్దంకి కృష్ణ, కంచర్లపల్లి నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు.