పోచమ్మ ఆలయానికి 20 వేల రూపాయల విరాళం

పోచమ్మ ఆలయానికి 20 వేల రూపాయల విరాళం

కడెం మే 13 ఆంధ్రప్రభ : కడెం మండలం లోని పెద్ద బెల్లాల్ జిపి పరిధిలో గల మొర్రిగూడెంలో నూతనంగా నిర్మాణం చేపట్టిన పోచమ్మ తల్లి ఆలయానికి డీసీసీ నిర్మల్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులకి గ్రామ పెద్దలకు 20 వేల రూపాయల నగదు ని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి విరాళం అందించారు విగ్రహ ప్రతిష్టాపన లో పాల్గొన్న ఆయనకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శాలువా కప్పి సన్మానం చేశారు
కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణo కడెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ జన్నారం మాజీ జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్ ఉప సర్పంచ్ తక్కల రమ్య రవీందర్ కాంగ్రెస్ నాయకులు తక్కల సత్యనారాయణ కొండాపురం లక్ష్మణ్ రాజేశ్వర్ రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు ఉన్నారు

Leave a Reply