పాఠశాల వంటగదిని ప్రారంభించిన ఎమ్మెల్యే సామెల్

పాఠశాల వంటగదిని ప్రారంభించిన ఎమ్మెల్యే సామెల్

మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని దాచారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.5 లక్షలతో నూతనంగా నిర్మించిన మధ్యాహ్న భోజనం వంటగదిని సోమవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, స్థానిక సర్పంచ్ కర్నె జ్యోతి వీరేశంతో కలిసి స్వయంగా ప్రారంభించారు. వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, నూతన వంటగదిని కాంట్రాక్టు నిర్వాహకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతి, ఎంపీడీఓ బాలాజీ నాయక్,సింగిల్ విండో చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రేణుక , ఉన్నత పాఠశాల హెచ్ ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.