పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

పంచాయతీ భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే

  • రూ.6.25 కోట్లు గ్రామభివృద్ధికి మంజూరు చేశా
  • డ్వాక్రా మహిళలు సబ్సిడీ పథకాన్ని ఉపయోగించుకోవాలి

వేంసూరు, ఆంధ్రప్రభ: రాయుడుపాలెం గ్రామపంచాయతీ అభివృద్ధికి రూ.6.25 కోట్లు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తెలిపారు. ఆదివారం రాయుడుపాలెం గ్రామ పంచాయితీ భవనాన్ని సర్పంచ్ మేకల ఇందిర రమేష్, పిఆర్ డిఇ వెంకటేశ్వరరావు, ఏఇ సాయికృష్ణ, కార్యదర్శి వేణు తో కలిసి ఆమె సంయుక్తంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఐదు కోట్ల రూపాయలతో బీటీ రోడ్లు, కోటి 25 లక్షలతో వివిధ అభివృద్ధి పనులకు కేటాయింపులు జరిగినట్లు తెలిపారు. అదేవిధంగా సర్పంచ్ ఇందిరా రమేష్ అడిగిన సీసీ రోడ్లు, కాంపౌండ్ వాల్, సబ్ సెంటర్ ముంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. డ్వాక్రా మహిళలకు 35 శాతం సబ్సిడీ పై ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ద్వారా ఉపాధి పొందేందుకు ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ స్థలదాత కాకర్ల వెంకట సుబ్బారావును ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి, మాజీ సర్పంచ్ మేడా వెంకటేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, గ్రామస్తులు సంయుక్తంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖరరెడ్డి మాజీ రైతుబంధు మండల అధ్యక్షులు వెల్ది జగన్ మోహనరావు, డిసిసిబి డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, మందపాటి రాఘవరెడ్డి, పర్సా కుటుంబరావు, మట్టా ప్రసాద్, కలపాల శేఖర్, ఒగ్గు కరుణాకర్ రెడ్డి, యర్రా సత్యనారాయణ, భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కనమాల ఆంధ్రయ, రాయుడుపాలెం ఉప సర్పంచ్ వీర వెంకు మహేశ్వరి, వార్డు సభ్యులు అర్చపల్లి సత్యవతి, మేకల నాగశిరోమణి, విస్సంపల్లి స్వరూపరాణి, మేకల మార్తమ్మ, కలపాల మురళీకృష్ణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలపాల శేఖర్, పెద్దగౌండ్ల ధర్మారావు, డీలర్ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ లక్ష్మయ్య, పుచ్చకాయల రాజేశ్వరరావు, తక్కెళ్లపాటి వెంకటేశ్వరరావు, మాజీ సహకార సంఘం అధ్యక్షులు నాగళ్ళ, గాలిపర్తి నాగేశ్వరరావు, చౌదరి, నందిగామ హరిబాబు, పొన్నగంటి చెన్నారావు, మద్దాల వరప్రసాద్, గరిగింటి బుచ్చయ్య, బొల్లికొండ శ్రీను, వీరవెంకు సురేష్, రంగిశెట్టి వేణు, వీరవెంకు మారేశ్వరరావు, చెన్నారావు, పుల్లయ్య, ఈడ మాధవరావు, పుల్లాచారి, కృష్ణారావు, ఎలమందల రాజా, వంట్ల వీర రాఘవులు, మిట్టపల్లి కృష్ణ, మిద్దె నాగేశ్వరరావు, అచ్చేపల్లి నాగరాజు, కలపాల యేసు, పెద్ద బుజ్జి, మేకల ఏసు, కోట వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు నాగయ్య, వంగూరు రవి తో పాటు పలువురు పాల్గొన్నారు.