టేకుమట్లలో గంజాయితో ముగ్గురు అరెస్ట్
టేకుమట్లలో గంజాయితో ముగ్గురు అరెస్ట్
ఆంధ్రప్రభ కథనానికి స్పందన
టేకుమట్ల, ఆంధ్రప్రభ: చాప కింద నీరు లాగా గంజాయి విస్తరణ జరుగుతుందని ఆంధ్ర ప్రభలో ప్రచురితమైన విషయము విధితమే. కాగ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్ చేశారు. గోప్య సమాచారం మేరకు చర్యలు చేపట్టిన పోలీసులు రైతు వేదిక సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారు సంతోష్, వంశీకృష్ణ, గణేశ్ గుర్తించారు. సుమారు 1.2 కిలోల ఎండు గంజాయి టేకుమట్లకు తరలిస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారని ఎస్సై అమూల్య వెల్లడించారు
