Temple | శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవం
Temple | శ్రీశైలంలో ముగిసిన బ్రహ్మోత్సవం
- భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారికి ఏకాంత సేవ
Temple | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలోని భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆదివారం సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. కార్యనిర్వహనాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు. మకర సంక్రమణ పుణ్యకాలాన్ని పురస్కరించుకుని ఈ నెల 12వ తేదీ నుండి నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపులో భాగంగా శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించబడ్డాయన్నారు.
Temple | అశ్వవాహనసేవ…
ఈ బ్రహ్మోత్సవాలలో నిర్వహించబడే వాహనసేవలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీ స్వామి అమ్మవార్లకు అశ్వవాహనసేవ జరిపించబడుతుందన్నారు .ఈ సేవలో శ్రీస్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై వేంచేబుచేయించి ప్రత్యేక పూజాదికాలు చేయబడుతాయన్నారు . ఆ తరువాత ఆలయప్రాంగణంలో ప్రాకారోత్సవం నిర్వహించబడుతుందన్నారు.

Temple | పుష్పోత్సవం, శయనోత్సవం…
ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు సాయంకాలం ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపం వద్ద శ్రీ స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిపించబడుతుందన్నారు. ఈ పుష్పోత్సవంలో స్వామిఅమ్మవార్లకు కాగడాలు, ఎర్రగులాబీలు, తెల్లగులాబీలు, పసుపు గులాబీలు, ఎర్రమందారం, తెల్లమందారం, ముద్దమందారం, నందివర్ధనం, గరుడవర్ధనం, కనకాంబరాలు, సుగంధాలు (లిల్లీపూలు), పసుపుచేమంతి, ఊదాచేమంతి, తెల్లచేమంతి, ఎర్రగన్నేరు, తెల్లగన్నేరు, దేవగన్నేరు, ముద్దగన్నేరు, మొదలైన 20 రకాలకు పైగా పుష్పాలు, బిల్వం, మరువం మొదలైన పలు రకాల పత్రాలతో స్వామిఅమ్మవార్లను విశేషంగా అర్చించడం జరుగుతుందన్నారు .
అదేవిధంగా అరటి, తెల్లద్రాక్ష, నల్లద్రాక్ష, దానిమ్మ, బత్తాయి, కమల, జామ, ఖర్జూరం, యాపిల్, ఫైనాపిల్, మొదలైన 11 రకాల ఫలాలు కూడా నివేదించబడుతాయన్నారు . ఆ తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించబడుతుందన్నారు . ఈ శయనోత్సవానికిగాను ఆలయప్రాంగణములోని స్వామివార్లశయన మందిరానికి విశేష పుష్పాలంకరణ చేయబడుతుందన్నారు. కార్యక్రమంలో వేద పండితులు పలువురు పాల్గొన్నారు.
