ఎడపల్లిలో తెలంగాణ రక్షణ సేనా పార్టీ జెండా ఆవిష్కరణ

ఎడపల్లి, ఆంధ్రప్రభ:ఎడపల్లి మండల కేంద్రంలోని మంగళ్ పహాడ్ చౌరస్తా వద్ద గురువారం తెలంగాణ రక్షణ సేనా పార్టీ జెండాను పార్టీ నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, అడహాక్ కమిటీ సభ్యుడు రాచర్ల శేఖర్‌రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ నాయకులు రామ్‌కిషన్‌రావు, అవంతిరావు, శేఖర్‌రాజు మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేనా పార్టీ వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆవిర్భవించిన ఈ పార్టీ అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో ప్రభావం చూపడం ఖాయమని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సామాజిక న్యాయం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గ్రామ, మండల స్థాయిలో విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత, మహిళలు, రైతులు పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అడహాక్ కమిటీ సభ్యులు వరలక్ష్మి, లక్ష్మీనారాయణ భరద్వాజ్, తెలంగాణ శంకర్, పంచరెడ్డి మురళి, భూషణ్, సత్యగౌడ్, ప్రవీణ్, రేఖ, రజిత, విజయ, శోభ, కరిపే రాజు, ఇరుముల శంకర్, అంబటి శ్రీనివాస్ గౌడ్, నిఖిల్ సాయి, ఆకాష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.