Telangana | చలి గజ గజ..

Telangana | చలి గజ గజ..

Telangana, ఉమ్మది ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : రాష్ట్రాన్ని (Telangana) చలి గాలులు చుట్టుముట్టాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న కటిక చలిగాలులకు రాత్రి ఉష్టోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా చలి తీవ్రత అనూహ్యంగా పెరుగుతుంది. దాంతో చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. కొద్ది రోజులుగా రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నట్టుగా వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది కనీష్ట ఉష్ణోగ్రతలు దాదాపు సగం వరుకు తగ్గినట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాయంత్రం ఆరు గంటల నుంచే చల్లని గాలులు వీచడం ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల మధ్య అతల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. ప్రజలు చలి నుంచి ఉపశమనం పొందడానికి చలి మంటలు వేసుకుంటున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి ప్రభావం కొనసాగుతుండడంతో వృద్దులు, చిన్నారులు ఇంటి నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. రాగల మూడు రోజులు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే 3 డిగ్రీల సెంటిగ్రేడు నుంచి 4 డిగ్రీ సెంటిగ్రేడు వరకు తక్కువుగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

Leave a Reply