మహబూబాబాద్,నర్సింహులపేట,మార్చి21(ఆంధ్రప్రభ):వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొన్న సంఘటనలో చర్లపాలెం గ్రామానికి చెందిన గూడెల్లి అరుణ(38)మృతి చెందగా ఐదుగురికి స్వల్ప గాయాలు,మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం తెల్లవారు జామున చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తొర్రూరు మండలం చర్లపాలెం వైపు నుండి మరిపెడ వైపు మిర్చి ఏరడానికి కూలీలను తీసుకువెళ్తున్న ఆటోను నర్సింహులపేట మండలం పెద్దనాగారం శివారు ఇటుక బట్టీల దగ్గర గుర్తుతెలియని లారీ స్వల్పంగా ఢీకొనడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టగా ఒకరు మృతితో పాటు నలుగురికి స్వల్ప గాయాలు కాగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి మూడు మండలాల అంబులెన్సులు చేరుకోగా గాయాలైన వారిని స్థానిక పోలీసులు మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనలో ఆపకుండా వెళ్లిన లారీ ఆచూకీ కొరకు పోలీసులు ఆరా తీస్తున్నారు.