Telangana | చాచా నెహ్రూ మళ్ళీ పుడితే…
Telangana | మోత్కూర్, ఆంధ్రప్రభ : కులమతాల కొట్లాటలతో, సామాజిక రుగ్మతలతో, సెల్ ఫోన్ బానిసత్వంతో మగ్గిపోతున్నఈ సమాజాన్ని బాగు చేయటానికి మళ్లీ పుట్టిన చాచా నెహ్రూ అనే సందేశంతో…ఈ రోజు భారత తొలి ప్రధాని చాచా నెహ్రూ జన్మదినం, బాలల దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని పాలడుగు ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన చాచా నెహ్రూ మళ్ళీ పుడితే …అనే నృత్య రూపకం పలువురిని ఆకర్షించింది.
బాలల దినోత్సవం, తల్లిదండ్రుల సమావేశంలో ప్రధానోపాధ్యాయులు వై. కమలాకర్ రెడ్డి(Y. Kamalakar Reddy) మాట్లాడుతూ.. చాచా నెహ్రూ బాటలో విద్యార్థులను నడిపించడానికి, శాంతి సహనం అలవరచడానికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాoజలి ఘటించారు.
ఈ కార్యక్రమంలో సాయి చైతన్య ఇంగ్లీషు మీడియం పాఠశాల కరస్పాండెంట్ బూరెడ్డి కవిత రవీందర్ రెడ్డి(Correspondent Booreddy Kavitha Ravinder Reddy), ప్రభుత్వ ఉపాధ్యాయులు వేంకటగిరి, రాములు, ప్రశాంతి,తల్లిదండ్రులు పాల్గొన్నారు.


