Group-3 | వృత్తిధర్మంలో సేవలందించాలి

Group-3 | వృత్తిధర్మంలో సేవలందించాలి
- తన్నీరు మల్లికార్జున్
Group-3 | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : ఇటీవల వెలువడిన గ్రూప్- 3(Group-3) ఫలితాల్లో ఉద్యోగం సాధించిన నర్సింగ్ విజయ్ ను ఇవాళ ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ రావు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను ప్రతి విద్యార్థి సాధించాలని, తల్లిదండ్రులు కన్న కలలు నెరవేర్చి సమాజంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు.
ఉద్యోగం సాధించిన వారు వృత్తిధర్మం(Profession)లో ప్రజలకు మంచి సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు 14వ వార్డు ఇంచార్జ్ కోలపూడి యోహాను, ఉత్తమ్ సోషల్ మీడియా కన్వీనర్ కొత్తూరు క్రాంతికుమార్, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.
