Telangana Fisheries | భారత మత్స్యరంగంలో తెలంగాణ ప్రాధాన్యం
Telangana Fisheries | భారత మత్స్యరంగంలో తెలంగాణ ప్రాధాన్యం
Telangana Fisheries | మహిళా సంక్షేమంతో ప్రజాప్రభుత్వం ముందడుగు
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చేపల ఉత్పత్తి
మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ అండ
చేపల ఉత్పత్తి పెంపుతో ఆర్థికాభివృద్ధి
Telangana Fisheries | నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది. అందులో భాగంగా ప్రాథమికంగా మహిళల కష్టాలలో ఆ ప్రభుత్వం భాగమైందనేది స్పష్టం. అధికారం చేపట్టగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీల్లో మొదటిదైన మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. అదేవిధంగా కరెంటు కష్టాలు, గ్యాస్ గోస ఆడబిడ్డలకు ఉండొద్దని 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500 గ్యాస్ సబ్సిడీ పథకాన్ని మొదలుపెట్టింది. కుటుంబంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని ఇందిరమ్మ పేరుతో డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి యజ్ఞంలా ముందుకు సాగుతోంది.
అన్నదాతలకు ప్రజాప్రభుత్వం కష్టాలు ఉండొద్దని రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. విద్య, వైద్య, సంక్షేమ రంగాలను తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ ప్రభుత్వం పనిచేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తి వేగంగా పెరుగుతున్న ముఖ్యమైన ఆహార రంగంగా మారింది. చైనా ప్రపంచంలోనే అత్యధికంగా చేపలను ఉత్పత్తి చేస్తోంది. ఆ తర్వాత ఇండోనేషియా, భారత్, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి ఆసియా దేశాలు ముందంజలో ఉన్నాయి. సముద్ర తీరప్రాంతాలు, నదులు, సరస్సులు, అలాగే ఆధునిక సాంకేతికత వాడకం వల్ల ఈ దేశాలు చేపల ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచస్థాయిలో చూస్తే, ఆసియా దేశాలే ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
చేపల ఉత్పత్తిలో మాత్రమే కాదు, చేపల పెంపకం రంగంలో కూడా కొన్ని దేశాలు ముందున్నాయి. ముఖ్యంగా చైనా ఈ రంగంలో అగ్రస్థానంలో ఉండగా, భారత్, ఇండోనేషియా, వియత్నాం, బంగ్లాదేశ్ దేశాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సహజ వనరులపై ఒత్తిడి పెరగడం, ప్రోటీన్ అవసరాలు పెరగడం వంటి కారణాలతో చేపల పెంపకం ప్రాధాన్యం పెరుగుతోంది. భవిష్యత్తులో చేపల అవసరాలను తీర్చడానికి అక్వాకల్చర్ కీలక పాత్ర పోషించనుంది.

ప్రపంచంలో కొన్ని దేశాల్లో చేపలను ప్రధాన ఆహారంగా తీసుకుంటారు. జపాన్, నార్వే, ఐస్లాండ్, దక్షిణ కొరియా, చైనా, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో చేపలు రోజువారీ ఆహారంలో ముఖ్య భాగంగా ఉంటాయి. ఈ దేశాల్లో సముద్రం లేదా నదులు సమీపంలో ఉండటం, చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా భావించడం వంటి కారణాలు దీనికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా చేపల్లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
భారతదేశంలో చేపల ఉత్పత్తి విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. దేశ మొత్తం చేపల ఉత్పత్తిలో పెద్ద భాగం ఈ రాష్ట్రం నుంచే వస్తోంది. పశ్చిమ బెంగాల్, గుజరాత్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ముఖ్యంగా ఉత్పత్తిలో వాటా కలిగి ఉన్నాయి. సాగునీటి వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఎగుమతుల అవకాశాలు ఈ రాష్ట్రాల్లో చేపల రంగం అభివృద్ధికి కారణమయ్యాయి.
చేపలను ఆహారంగా తీసుకునే రాష్ట్రాల విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్ ముందంజలో ఉంది. అక్కడ చేపలు దైనందిన ఆహారంలో ముఖ్యమైన భాగంగా ఉంటాయి. అస్సాం, ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో కూడా చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో నదులు, సముద్రం సమీపంలో ఉండటం, సంప్రదాయ ఆహార అలవాట్లు ఉండటం వల్ల చేపల వినియోగం అధికంగా కనిపిస్తుంది.
మొత్తంగా చూస్తే, ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో చేపల ఉత్పత్తి, వినియోగం రెండూ పెరుగుతున్నాయి. ఇది పోషకాహారం అందించడంలోనే కాకుండా ఆర్థికాభివృద్ధికి కూడా దోహదం చేస్తోంది. భవిష్యత్తులో చేపల పెంపకం మరింత విస్తరించి, ఆహార భద్రతలో కీలక పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
తెలంగాణలో చేపల పెంపకంపై ఆధారపడిన కుటుంబాలు అత్యధికం. ముదిరాజులు, గంగపుత్రులు, కొన్ని ఇతర కులాల వారు చేపల పెంపకం, వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్రంలో 6,243 రిజిస్టర్డ్ సొసైటీలు ఉండగా, వాటిలో 4 లక్షల 28 వేల 820 మంది సభ్యులున్నారు. వీళ్లంతా ప్రత్యక్షంగా మత్స్యరంగంలో ఉపాధి పొందుతుండగా, పరోక్షంగా ఉపాధి పొందేవారు లక్షల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
లక్షల మందికి ఉపాధి వనరుగా ఉన్న మత్స్యరంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కొలువుదీరిన తర్వాత చేపల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ లక్ష్యానికి అనుగుణంగా 2023-2024 ఏడాదిలో చేపల ఉత్పత్తికి సంబంధించి 4,39,513 టన్నులకు రూ.6,51,438 లక్షల ఆదాయం వచ్చింది. 2024-2025 ఏడాదిలో 4,62,770 టన్నులకు రూ.6,91,116 లక్షల ఆదాయం లభించింది. 2025-2026 ఫిబ్రవరి వరకు 4,66,716 టన్నులకు రూ.7,15,104 లక్షల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
అదేవిధంగా రొయ్యల ఉత్పత్తికి సంబంధించి 2023-2024లో 16,532 టన్నులకు రూ.54,465 లక్షలు, 2024-2025లో 14,513 టన్నులకు రూ.48,939 లక్షలు, 2025-2026 ఫిబ్రవరి వరకు 10,751 టన్నులకు రూ.36,326 లక్షల ఆదాయం వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1,33,68,999 టన్నుల చేపలకు రూ.20,63,058 లక్షల ఆదాయం వచ్చింది. 41,796 టన్నుల రొయ్యలు ఉత్పత్తి కాగా, రూ.1,07,030 లక్షల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరింది.
రాష్ట్రంలోని 45 వేల పెద్ద చెరువులు, 26 వేలకుపైగా ఉన్న చిన్న చెరువులు, 100 రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర మత్స్య సహకార సంఘానికి చైర్మన్‌ను నియమించకపోవడంతో మత్స్యకారుల సంక్షేమం నిలిచిపోయింది.
అయితే ప్రజాప్రభుత్వం అధికారం చేపట్టగానే మత్స్య సహకార సంఘానికి చైర్మన్‌ను నియమించడంతో పాటు, ఎప్పటికప్పుడు ఆ శాఖను పర్యవేక్షించే మంత్రి వాకిటి శ్రీహరి ఉండటం వల్ల మత్స్యశాఖ ఆదాయం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి పౌష్టికాహారం అందించడమే కాకుండా, మత్స్యకార కుటుంబాలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముందుకు సాగుతున్నారు.
మత్స్యశాఖ బలోపేతం, చేపల ఉత్పత్తి పెంపు కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాప్రభుత్వంలో అందరికీ సమన్యాయం జరుగుతుందనే విశ్వాసంతో ఈ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
బండారు జితేందర్
పీఆర్వో, రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, మత్స్య మంత్రిత్వ శాఖ
ఫోన్ : 7207541667
