tamilnadu | కాంగ్రెస్ షరతులు.. అన్నాడీఎంకే సైగలు..

tamilnadu | కాంగ్రెస్ షరతులు.. అన్నాడీఎంకే సైగలు..

tamilnadu | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్: ఇప్పుడు అందరి చూపూ తమిళనాడు రాజకీయాలపైన, ‘దళపతి’ విజయ్ వైపే ఉన్నాయి. తన రాజకీయ పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్, మొదటి అడుగుతోనే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్మ, అన్నాడీఎంకే పార్టీలు విజయ్ విషయంలో అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

కాంగ్రెస్ ‘షరతుల’ మద్దతు..
ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, విజయ్ పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యానాలు చేసింది. విజయ్ సిద్ధాంతాలు గనుక సెక్యులరిజం (లౌకికవాదం), సామాజిక న్యాయానికి అనుగుణంగా ఉంటే మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధమని అధికారికంగా ప్రకటన జారీ చేశాయి. ఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, విజయ్ మద్దతు కోసం డీఎంకేతో 55 ఏళ్ల సుదీర్ఘ పొత్తును తెంచుకునే దిశగా అడుగులు వేయడం సంచలనం సృష్టించింది. 

అన్నాడీఎంకే స్నేహహస్తం?
మరోవైపు, ప్రతిపక్ష అన్నాడీఎంకే సైతం విజయ్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. డీఎంకే వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చకుండా, విజయ్‌తో కలిసి సాగితే అధికార పీఠాన్ని దక్కించుకోవచ్చనేది అన్నాడీఎంకే ఆలోచనగా ఉంది. ఇటీవలి పరిణామాల నేపథ్యంలో, విజయ్ నిర్ణయాలు అన్నాడీఎంకే వైపు మొగ్గు చూపుతాయా లేక ఒంటరి పోరాటమా అనేది ఆసక్తికరంగా మారింది.

నిర్ణాయక శక్తిగా టీవీకే..
తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి విజయ్ చెక్ పెట్టగలరా? అన్నదే ఇప్పుడు ప్రశ్న. విజయ్‌కున్న భారీ ఫ్యాన్ బేస్, యువత మద్దతు ఏ పార్టీకి కలిసొస్తే ఆ పార్టీకి విజయం ఖాయం. వచ్చే ఎన్నికల నాటికి విజయ్ ఏ కూటమిలో చేరుతారు లేదా కొత్త కూటమిని ఏర్పాటు చేస్తారా అనేది రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది విజయ్ రాజకీయ పయనం కేవలం సినిమా గ్లామర్‌తోనే సాగుతుందా లేక బలమైన ఓటు బ్యాంకుగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాలి. కాంగ్రెస్ మద్దతు, అన్నాడీఎంకే వ్యూహాల మధ్య విజయ్ ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.