ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి
మంచిర్యాల, ఆంధ్రప్రభ : ఏఐటీయూసీ జిల్లా మహాసభలు ఆగస్టు 2న మంచిర్యాల సిపిఐ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని జిల్లాలోని ఏఐటీయూసీ సభ్యులు, నాయకులు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు పిలుపునిచ్చారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం దాసు మాట్లాడుతూ. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నాలుగు లేబర్ కోడుల వలన కార్మిక శాఖ అధికారుల ద్వారా కార్మికులకు భారీ నష్టం జరిగినప్పుడు ఆ యజమాన్యాలకు కట్టబెట్టిన అనుమతులను రద్దుచేసి నష్టపోయిన కార్మికునికి పరిహారం చెల్లించే విధంగా పాత లేబర్ చట్టాల హక్కులను తిరిగి కల్పించాలని డిమాండ్ చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడు ల వల్ల కార్మికులకు యజమాన్యాలకు అనుసంధానకర్తలుగా తప్ప జరిగిన నష్టానికి విచారణ చేసి వివరణ ఇచ్చే అధికారం కార్మిక శాఖ అధికారులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి కార్మికునికి ఎనిమిది గంటల పని విధానం పోయి యజమాన్యానికి 10 నుండి 12 గంటల పని విధానం అమరుల్లోకి వచ్చే విధంగా ఉన్నాయని పూర్తిస్థాయిలో కార్మికులకు నష్టదాయకంగా ఈ చట్టాలు అమలు చేస్తున్నారని ఇలాంటి చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మా సభల పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎండి అక్బర్ అలీ, నాయకులు కలిందర్ అలీ ఖాన్, మిట్టపల్లి పౌలు, దాగం మల్లేష్, లింగం రవి, మధు, హమాలి యూనియన్ అధ్యక్షులు సత్యనారాయణ,రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.
