Tadwai | ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి
Tadwai | ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి
ఎంఈఓ శ్రీనివాస్
Tadwai | తాడ్వాయి, ఆంధ్రప్రభ : పాఠశాలలో ప్రకృతి రమణీయత ఉట్టిపడాలని తాడ్వాయి Tadwai ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ (Gaddi Srinivas) అన్నారు. మండలంలోని జడ్పీ హెచ్ఎస్ ఇంద్రానగర్ పాఠశాలలో హెచ్ఎం రేణుక ఆధ్వర్యంలో దాదావు 200 వేపచెట్లు, పూల మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిది గా హాజరైన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ (Gaddi Srinivas) మాట్లాడుతూ… వచ్చే సంవత్సరం వరకు ప్రతి పాఠశాలలో కిచెన్ గార్డెన్ స్కూల్ గార్డెన్ పూర్తయి ఆహ్లాదకారంగా ప్రకృతి రమనీయతతో పాఠశాల పరిసరాలు ఉండేలా టార్గెట్ పెట్టుకొని మండలంలో మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇంద్రానగర్ హెచ్ఎం రేణుక ఉపాధ్యాయులు శ్రవణ్ కృషిని అభినందించారు. ఈ సందర్భంగా గడ్డి శ్రీనివాస్ ఒక మొక్కను నాటారు. ఈకార్యక్రమంలో హెచ్ఎం రేణుక, ఉపాధ్యాయులు శ్రవణ్ శంకర్ వసంత్ రావ్, లక్ష్మయ్య, వనిత, సిబ్బంది రమ రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
