T20 World | ప్రత్యక్షంగా వీక్షించడం మరువలేని అనుభూతి
T20 World | ప్రత్యక్షంగా వీక్షించడం మరువలేని అనుభూతి
ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
T20 World | శ్రీకాళహస్తి, ఆంధ్రప్రభ : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన టి 20 వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన అద్భుత విజయంపై శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించడం ఒక మరువలేని అనుభూతిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, స్టేడియం అంతా ఇండియా ఇండియా నినాదాలతో మారుమోగిపోతుంటే కలిగిన ఉత్సాహం, దేశభక్తిని మాటల్లో వర్ణించలేమని ఉద్వేగంగా చెప్పారు. మిత్రులతో కలిసి భారత జట్టుకు మద్దతు తెలపడం, గెలుపు క్షణాలను పంచుకోవడం గర్వంగా ఉందన్నారు.మన ఆటగాళ్ల పోరాట పటిమ అమోఘమని, ప్రపంచం గర్వించేలా ఆడి మూడవసారి ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడిన టీమ్ ఇండియాకు ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.




CLICK HERE TO READ MORE : t20| ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన భారత్
