18TH | అనుమతి లేకుండా దీక్ష, ట్రాఫిక్ అంతరాయం ఆరోపణలు

18TH | అనుమతి లేకుండా దీక్ష, ట్రాఫిక్ అంతరాయం ఆరోపణలు
18TH |ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు పై తాజాగా పోలీసులు మరో కేసు నమోదు చేసారు. ఈ నెల 18న అంబటి రాంబాబు అనుమతి లేకుండా దీక్ష చేపట్టారనే ఆరోపణలతో ఈ కేసు నమోదు చేసినట్లు సమాచారం. ముందస్తు అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించడం చట్ట విరుద్ధమని పేర్కొంటూ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అంతేకాకుండా, ఆ రోజు నిర్వహించిన దీక్ష కారణంగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు తమ కేసులో ప్రస్తావించారు. రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా, తన ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబటి రాంబాబు ఈ దీక్ష చేపట్టారు. తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, దాడి వెనుక ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
