ఆర్థిక సహాయం అందజేత

గట్టుప్పల, ఏప్రిల్8 (ఆంధ్రప్రభ): గట్టుప్పల మండల కేంద్రానికి చెందిన పగిళ్ల స్వామి ఇటీవల అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నామపురం మాజీ సర్పంచ్ కంచుకట్ల సంపత్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
వీరి వెంట కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పగిళ్ల యాదయ్య,వార్డ్ సభ్యులు పగిళ్ల శంకరయ్య,మాజీ వార్డ్ సభ్యులు పగిళ్ల వెంకన్న,నల్లవెల్లి రాజు,యూత్ కాంగ్రెస్ నాయకులు పగిళ్ల అది, పగిళ్ల గణేష్,పగిళ్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
