షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం..

షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధం..

కుబీర్, ఆంధ్రప్రభ : కుబీర్ మండలంలోని ధర్‌కుబీర్ గ్రామానికి చెందిన రైతుల పంటలు షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిబూడిదయ్యాయి. ధర్‌కుబీర్‌కు చెందిన రైతు దొంతుల అనసూయకు చెందిన 3 ఎకరాల జొన్న పంట, బంక మారుతికి చెందిన 2 ఎకరాల జొన్న పంట, బంక భోజరాంకు చెందిన 2 ఎకరాల జొన్న పంట పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే కౌలు రైతు సిద్ధార్థ బాన్సడేకు చెందిన 2 ఎకరాల మొక్కజొన్న పంట కూడా అగ్నికి ఆహుతైంది. బంక రేణుకకు చెందిన మామిడి చెట్టు, బాన్సడే గంగాధర్‌కు చెందిన చింత చెట్టు కూడా కాలిపోయాయి.

చేతికి అందివచ్చిన పంట కళ్ల ముందే కాలిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నష్టపోవడంతో బాధిత రైతులు విలవిల్లాడారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. చేతికి వచ్చిన పంట ఇలా కాలిపోవడం చాలా బాధాకరమని, రైతులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

మొక్కజొన్న పంట నష్టంపై మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం సంబంధిత తహసీల్దార్‌తో చరవాణిలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కుబీర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోనె కళ్యాణ్, కుబీర్ సర్పంచ్ సాయినాథ్, హల్దా సర్పంచ్ దేవేందర్, రాజూరా సర్పంచ్ మారుతీ, బెల్గాం తండా సర్పంచ్ గోకుల్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ రాములు పాల్గొన్నారు.

ధర్‌కుబీర్ ఉప సర్పంచ్ అశోక్, మాజీ సర్పంచ్ విజయ్, డైరెక్టర్లు అరుణ్, బంక ఆనంద్, బాల ఆనంద్, బాలాజీ, డాక్టర్ పెంటాజీ, మల్లేష్ యాదవ్, సతం రవి, మాజీ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, నారిడి మల్లేష్, బొప్ప నాగలింగం, మిలింద్, మంగలి సాయినాథ్, అశోక్ పటేల్, బాన్సడే ఈర్వ, బంక విఠల్, అవునూరు విఠల్, బక్కన్న, జిడ్డు నాగన్న, డాక్టర్ మధు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply