బ్లాక్ బెల్ట్ అవార్డులు ప్రదానం చేసిన సుమన్..

బ్లాక్ బెల్ట్ అవార్డులు ప్రదానం చేసిన సుమన్..

జనగామ, ఆంధ్రప్రభ: కరాటే ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థులకు విక్టరీ షోటో కాన్ కరాటే అకాడమీ గౌరవ అధ్యక్షుడు సినీ హీరో సుమన్ తల్వార్ చేతుల మీదుగా బెల్టులు ప్రధానం చేశారు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓరుగంటి అక్షిత్ మనివర్ధన్ కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించగా, నిక్షిత్ మణివర్ధన్ బ్రౌన్ బెల్ట్‌లో షోధాన్ సర్టిఫికేట్ పొందినట్లు కరాటే మాస్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.

విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ ఇండియా చీఫ్ రంగు మల్లికార్జున్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో ఈ విజయాలు సాధించినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా అక్షిత్ మనివర్ధన్, నిక్షిత్ మణివర్ధన్‌లను విక్టరీ షోటోకాన్ కరాటే అకాడమీ గౌరవ అధ్యక్షుడు, సినీ హీరో సుమన్ తల్వార్ ప్రత్యేకంగా అభినందించి బెల్టులు ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో అకాడమీ సీనియర్ మాస్టర్లు శ్రీనివాస్, వెంకటేష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply