ఇద్దరు టీచర్లతో విద్యార్థుల అవస్థలు

ఇద్దరు టీచర్లతో విద్యార్థుల అవస్థలు
వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ మండల సమీపంలోని చెదురుపల్లి గ్రామంలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటు గ్రామస్తులు, తల్లిదండ్రులు ఈ రోజు తహసిల్దార్ కార్తీక్ కుమార్(Karthik Kumar)కు, ఎంఈఓ చంద్రుడికి వేరువేరుగా వినతి పత్రాలన్ని అందజేశారు.
చెదురుపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుండి ఏడవ తరగతి వరకు 28 మంది విద్యార్థులకు గాను ఒకరు ప్రధానోపాధ్యాయులు గా మరొక్కరు ఉపాధ్యాయులుగా ఇద్దరే టీచర్లు ఉండడంతో విద్యార్థులు విద్యలో వెనకపడుతున్నారని తల్లీ తండ్రులు గ్రామస్తులు అన్నారు. అదనంగా ఉపాధ్యాయులను(teachers) నియమించి విద్యార్థులకు సరైన బోధనను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పోలే అశోక్, గజ్జ శ్రీరాములు,మెరుగు పర్వతాలు,మద్రాసు శివ, పాల లక్ష్మణ్,కొమ్మగోని శివ, తదితరులు పాల్గొన్నారు.
