TG | 23న‌ వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని అనేక సంవత్సరాలుగా విద్యార్థి, యువజన సంఘాలు పోరాటాలు చేస్తున్నా పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సంఘనేతలు ఆరోపించారు.

రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేకపోకడం వల్లనే విద్యారంగం కుంటుపడిందని, దీనికి ప్రభుత్వమే భాద్యత వహించాలన్నారు. అలాగే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఎంఇఓ, డీఈఓ, తదితర పోస్టులను భర్తీ చేయాలని, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో అవినీతిని, గుర్తింపు లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలని, పెండింగ్‌ లో ఉన్న రూ.8వేల కోట్ల విద్యార్థుల ఉపకార వేతన బకాయిలను, బోధనా రుసుములను విడుదల చేయాలని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు.