Chityala చిట్యాల పోలీస్ స్టేషన్‌పై ఆకస్మిక తనిఖీ
Chityala చిట్యాల పోలీస్ స్టేషన్‌పై ఆకస్మిక తనిఖీ
- పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ ఎస్పీ ఆదేశం
చిట్యాల (Chityala), ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని చిట్యాల పోలీస్ స్టేషన్‌ను జిల్లా అడిషనల్ ఎస్పీ నరేష్ నాయక్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లో అమలవుతున్న క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్‌ఎస్) సాఫ్ట్‌వేర్ పనితీరుపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా చిట్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. మల్లేష్, సబ్‌ఇన్‌స్పెక్టర్ పోచంపల్లి సతీష్‌లు స్టేషన్ పరిధిలో సీసీటీఎన్‌ఎస్ ద్వారా అందిస్తున్న ఆన్‌లైన్ సేవల పురోగతి, కేసుల నమోదు విధానాన్ని కంప్యూటర్ స్క్రీన్ ద్వారా అడిషనల్ ఎస్పీకి వివరించారు.
స్టేషన్‌లో ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దర్యాప్తు కేసుల రికార్డులను అడిషనల్ ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం టెక్ టీమ్, రైటర్లు, సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.
పెండింగ్‌లో ఉన్న అన్ని యూఐ కేసుల ఫైళ్లను నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసి, ఎలాంటి ఆలస్యం లేకుండా సీసీటీఎన్‌ఎస్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ రికార్డులను ఎల్లప్పుడూ పారదర్శకంగా, నవీకరితంగా ఉంచాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల పోలీస్ స్టేషన్ టెక్ టీమ్ రైటర్లు ఎ. మమత, జి. నాగమణి, లాల్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
